CM Siddaramaiah : కేసీఆర్ ధోకా కాంగ్రెస్ పక్కా
కర్ణాటక సీఎం సిద్దరామయ్య
CM Siddaramaiah : కామారెడ్డి – తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందన్నారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. ఇన్నేళ్లుగా ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసిన సీఎం కేసీఆర్ కు పాలించే నైతిక హక్కు లేదన్నారు. తమ మీద బురద చల్లడం మానుకోవాలని సూచించారు. ఎవరు ఏమిటనేది జనానికి తెలుసన్నారు.
CM Siddaramaiah Comment
కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట టీజేఎస్ చీఫ్ కోదండ రామ్ రెడ్డి, సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బీసీ డిక్లరేషన్ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సిద్దరామయ్య.
తాము ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ పదే పదే ప్రచారం చేస్తోందని ఇది పూర్తిగా అబద్దమన్నారు. సీఎంతో పాటు తన మంత్రివర్గం మొత్తం కర్ణాటకకు రావాలని సవాల్ విసిరారు. అమలు చేస్తున్నామో లేదో తెలుస్తుందన్నారు.
అబద్దాలతో ఎన్నాళ్ల పాటు ఇలా పాలన సాగిస్తారని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఇకనైనా కేసీఆర్ మారాలని హితవు పలికారు.
Also Read : DK Shiva Kumar : కేసీఆర్ ఖేల్ ఖతం – డీకే