Chandra Mohan : హైదరాబాద్ – ప్రముఖ నటుడు చంద్రమోహన్(Chandra Mohan) శనివారం కన్ను మూశారు. తెలుగు, తమిళ సినీ రంగాలలో పలు సినిమాలలో నటించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. హీరోగా, కీలకమైన పాత్రలలో మెప్పించారు. సౌమ్యుడిగా పేరు పొందారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారన్న పేరుంది. ఒక గొప్ప నటుడిని కోల్పోవడం బాధాకరమని సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Chandra Mohan No More
ఆయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో మే 23, 1942లో పుట్టారు. బీఎస్పీ చదివారు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.
హీరోగా 175 చిత్రాలలో నటించారు. 930కు పైగా సినిమాలలో కీలక పాత్రల్లో జీవించారు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో తన కెరీర్ ప్రారంభమైంది. కథా నాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించారు. తనతో కలిసి నటిస్తే హీరోయిన్లకు సక్సెస్ అవుతారన్న నమ్మకం ఉండేది. స్టార్ హీరోయిన్లుగా గతంలో ఉన్న వారు ఆయనతో నటించిన వారే.
Also Read : BRS Joinings : కాంగ్రెస్ కు షాక్ బీఆర్ఎస్ కు జంప్