Eatala Rajender : గజ్వేల్ – సీఎం కేసీఆర్ ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender). ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్ల బరిలో నిలిచారు. హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. భారీ ఎత్తున ఆదరణ లభిస్తోందని అన్నారు ఈటల.
Eatala Rajender Comment
శనివారం గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కక్ మండలం, పాములపర్తి నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి బీజేపీ కండువాలు కప్పారు. ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా , ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటమి తప్పదన్నారు. తాను రెండు చోట్ల గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. ఇన్నాళ్ల పాటు గజ్వేల్ లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. గజ్వేల్ కాకుండా ఎందుకని కామారెడ్డి లో పోటీ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తనపై లేనిపోని ఆరోపణలు చేసినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , గులాబీ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారు ఈటల రాజేందర్. వ్యవస్థలను నిర్వీర్యం చేసి , అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేసీఆర్ ను ప్రజలు నమ్మరన్నారు.
Also Read : Tula Uma : బీజేపీ నేతలను చెప్పుతో కొడతా