TTD Chairman : ఆధ్యాత్మికతకు సోపానాలు గ్రంథాలు
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman : తిరుపతి – ఆధ్యాత్మికతను పెంపొందించడంలో భక్తితో కూడిన గ్రంథాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దశేష వాహన సేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు.
TTD Chairman Comment
ఆంధ్ర వాగ్గేయకారులలో తాళ్ళపాక అన్నమయ్య పెద్ద తిరుమలయ్య, చిన్న తిరుమలయ్య శ్రీవేంకటేశ్వరస్వామిని కీర్తించిన ధన్యజీవులని పేర్కొన్నారు. అన్నమయ్య శ్రీవారి మహిమలను, క్షేత్రాన్ని, తీర్థాలను మాత్రమే కాకుండా శ్రీవారి సేవలను సేవకులను కూడా కొనియాడారని తెలిపారు. విశేషంగా వివిధ దేవతామూర్తులతో శ్రీవారికున్న అభేదాన్ని, అనుబంధాలను కూడా విశ్లేషించారు.
తాళ్ళపాక కవుల సంకీర్తనలను శృంగార, ఆధ్యాత్మిక, యోగ కీర్తనలుగా పరిశోధకులు తెలియజేశారు. తాళ్ళపాక కవులు ఈ కీర్తనలలో కళ్ళకు కట్టినట్టుగా శ్రీవారి సేవలను, కైంకర్యాలను వర్ణించి దర్శింప జేశారు.
కల్యాణోత్సవ సంకీర్తనలు, అభిషేక సంకీర్తనలు, రథోత్సవ సంకీర్తనలు, హనుమత్సం కీర్తనలు అనే నాలుగు అంశాలకు సంబంధించిన సంకీర్తనలను ఒక చోట చేర్చారు. విడివిడిగా విశ్లేషణాత్మకమైన చక్కటి పీఠికతో శ్రీ తాళ్ళపాక పద కవుల సంకీర్తనలు అనే పేరున టీటీడీ ద్వారా ఆచార్య కె. సర్వోత్తమరావు భక్త లోకానికి అందిస్తున్నారు.
సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతకు త్రిమతాచార్యులు వ్యాఖ్యానాలు రాశారు. మధ్వాచార్యుల అనే పరంపరలో వచ్చిన మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వాములవారు భగవద్గీతకు ‘గీతా వివృత్తి’ వ్యాఖ్యను రాశారు. ఆ వ్యాఖ్యను బెంగళూరుకు చెందిన గిరిధర్ బోరె ఇంగ్లీషులో అనువాదం చేసి టీటీడీ ద్వారా భక్త లోకానికి అందిస్తున్నారు.
. శ్రీ విద్యా విలాసము శ్రీ శంకరభగవత్పాద శిష్య ప్రణీతము. ఈ గ్రంథాన్ని అద్వైత పరబ్రహ్మ శాస్త్రి సంకలనం చేశారు.
Also Read : Tirumala : 19న తిరుమలలో పుష్పయాగం