TS Nominations : 119 నియోజకవర్గాలు 4,798 నామినేషన్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
TS Nominations : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వికాస్ రాజ్ వెల్లడించారు. ఆదివారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్(Congress), భారతీయ జనతా పార్టీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐతో పాటు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఈసారి భారీ ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TS Nominations Update
మొత్తం 4,798 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు సీఈవో. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోకవర్గాల పరంగా అందిన నామినేషన్ల పరంగా చూస్తే బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధిక దరఖాస్తులు అందాయని తెలిపారు.
ఈ ఒక్క నియోజకవర్గంలో 145 నామినేషన్లు అత్యధికంగా వచ్చినట్లు పేర్కొన్నారు. మేడ్చల్ లో 116 దరఖాస్తులు, కామారెడ్డి నియోజకవర్గంలో 92 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే నారాయణపేటలో అత్యల్పంగా 13 దరఖాస్తులు అందాయని తెలిపారు వికాస్ రాజ్.
Also Read : Revanth Reddy Visit : శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి