G Kishan Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు ఆ పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరు పెంచుతుంటే ఇంకా ఇప్పటి దాకా పార్టీ పరంగా మేనిఫెస్టోను ప్రకటించ లేదు. దీంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కమలాన్ని వీడారు. గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వివేక్ , విజయ శాంతి , చంద్రశేఖర్ జంప్ అయ్యారు.
G Kishan Reddy Comment
వారు పార్టీని వీడుతున్నా నిలిపేందుకు ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఈసారి తాము నిర్ణయాత్మక పాత్ర పోషించ బోతున్నామని కిషన్ రెడ్డి(G Kishan Reddy) స్పష్టం చేశారు. తమకు ఆశించిన దాని కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు.
రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. లక్షా 20 వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట శనేశ్వరంగా మారిందని ఆవేదన చెందారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇక కమలం రాష్ట్రంలో రానుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి రాహుల్ చంద్రతో కలిసి పాదయాత్ర చేపట్టారు కిషన్ రెడ్డి.
Also Read : Revanth Reddy : మోసం కేసీఆర్ నైజం