Tirumala Rush : తిరుమలలో భక్త జన సందోహం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లు
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది ప్రసిద్ధమైన పుణ్య క్షేత్రం తిరుమల. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. జన సందోహంతో నిండి పోతోంది. భారీ ఎత్తున తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈవో ఏఈ ధర్మారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Tirumala Rush with Devotees
ఇందులో భాగంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ప్రత్యేకించి శ్రీవారి సేవకులు, టీటీడీ(TTD) సిబ్బంది, ఉద్యోగులు అందజేస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండి పోయింది. శ్రీవారిని 67 వేల 140 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 870 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాలు సమర్పించే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.10 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు