Varudu Kalyani : బీసీల కుల గణనపై విమర్శలేలా
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
Varudu Kalyani : విశాఖపట్నం – రాష్ట్ర సర్కార్ బీసీ కుల గణన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలు ఓర్చు కోవడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Varudu Kalyani). ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. కుల గణనను స్వాగతించాల్సింది పోయి నిరాధార విమర్శలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.
Varudu Kalyani Comment
ఇది మంచి పద్దతి కాదన్నారు. ఒక విజన్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడటం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. జనం అన్నీ చూస్తున్నారని గతంలో కోలుకోలేని దెబ్బ కొట్టారని ఈసారి కూడా వారికి షాక్ తప్పదన్నారు వరుదు కళ్యాణి.
పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీ వాయిస్ వినిపించేలా తమ ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇచ్చారని స్పష్టం చేశారు. బీసీల పాలిట శనిలా దాపురించాడని చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు అవమానించినప్పుడు ఎందుకు నోరెత్తడం లేదంటూ అచ్చెన్నాయుడును నిలదీశారు. ఇవాళ బీసీల కోసం అంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు .
తమ నాయకుడు సీఎం అయ్యాక కేబినెట్ లో 67 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రయారిటీ ఇచ్చారని, పదవులు కట్టబెట్టారని తెలిపారు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేక పోయారంటూ ప్రశ్నించారు.
Also Read : Vijaya Shanti : దొర గడీలు కూలడం ఖాయం