Amit Shah : వెళ్లి పోయే వాళ్లను పట్టించుకోం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
Amit Shah : హైదరాబాద్ – బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి సిద్దాంతం ఉందని, ఎవరు పడితే వాళ్లు గీత దాటి మాట్లాడరని స్సష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకట స్వామి, విజయ శాంతి పార్టీనీ వీడడంపై అమిత్ షా స్పందించారు. ఈ సందర్బంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Amit Shah Comment
బీజేపీ బీసీ నినాదంతో ముందుకు వెళుతోందన్నారు. తాము విడుదల చేసిన మేనిఫెస్టో ఇతర పార్టీల కంటే భిన్నంగా, మెరుగ్గా ఉందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇది మీరే చూస్తారని అన్నారు. ఇవాళ జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషించడం ఖాయమని జోష్యం చెప్పారు.
వాళ్లు తమ ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చారు. వాళ్ల కోసం తమ పార్టీ విధానాలను మార్చు కోవాల్సిన అవసరం లేదన్నారు అమిత్ షా(Amit Shah). కేసీఆర్ తమ పార్టీలో కోవర్టులు ఉన్నారని అంటున్నాడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. డిసెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో సర్కార్ ఎవరు ఏర్పాటు చేయబోతారో మీరు చూస్తారంటూ స్పష్టం చేశారు కేంద్ర హొం శాఖ మంత్రి.
Also Read : Karnataka CM : దళిత సీఎం ఊపందుకున్న నినాదం