Tirumala Rush : తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తులు 79,800

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌. సెల‌వు రోజు ఆదివారం కావ‌డంతో పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లించారు. సుదూర ప్రాంతాల నుండి త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ) చ‌ర్య‌లు చేప‌ట్టింది.

Tirumala Rush with Devotees

గ‌తంలో కంటే ఎక్కువ‌గా ఈసారి స్వామి వారిని ద‌ర్శించు కోవ‌డం విశేషం. ఏకంగా శ్రీ‌వారిని 79 వేల 800 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 25 వేల 962 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. నిత్యం భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు వ‌చ్చింద‌ని టీటీడీ(TTD) వెల్ల‌డించింది.

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లోని 20 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగేందుకు క‌నీసం 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల‌లో ఘ‌నంగా నిర్వ‌హిస్తూ వ‌చ్చిన శ్రీ‌వారి పుష్ప యాగం ముగిసింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ.

Also Read : Travis Head : బెంబేలెత్తించిన ట్రావిస్ హెడ్

Leave A Reply

Your Email Id will not be published!