AP CM YS Jagan : అగ్ని ప్ర‌మాదం విచార‌ణ‌కు ఆదేశం

రూ. 30 కోట్ల‌కు పైగా ఆస్తి న‌ష్టం

AP CM YS Jagan : విశాఖ‌ప‌ట్నం – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. నిన్న అర్ధ‌రాత్రి విశాఖ ప‌ట్టణంలోని ఫిషింగ్ హార్బ‌ర్ (ఓడ‌రేవు)లో భారీ ఎత్తున అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్ర‌మాదంలో దాదాపు 100 బోట్ల‌కు పైగా ద‌గ్ధ‌మ‌య్యాయి.

AP CM YS Jagan Orders

అర్ధ‌రాత్రి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. చూస్తూ ఉండ‌గానే క్ష‌ణాల్లోనే ఇత‌ర బోట్ల‌కు వ్యాపించాయి మంట‌లు. ఈ మొత్తం భారీ అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 30 కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచ‌నా వేశారు.

క‌ళ్ల ముందు బోట్లు బూడిదై పోవ‌డంతో మ‌త్స్య కారులు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. బోట్ల‌లో పెట్రోల్, డీజిల్ ఉండ‌డంతో మంట‌లు చోటు చేసుకున్నాయి. ఎవ‌రో ఆక‌తాయి నిప్పంటించి ఉంటార‌ని భావిస్తున్నారు. ఈ మొత్తంగా ఘ‌ట‌నపై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan). ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను సీఎంకు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు సీఎస్.

వెంట‌నే ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు సీఎం. ఏపీ మంత్రి సిదిరి అప్ప‌ల‌రాజును ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లాల‌ని ఆదేశించారు. బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

Also Read : Pat Commins : క‌మిన్స్ కామెంట్స్ క‌ల‌కలం

Leave A Reply

Your Email Id will not be published!