CM KCR : సూర్యాపేట – నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో కొన్నేళ్ల పాటు పోరాడేందుకు కారణమైంది ఎవరో మీకు తెలియదా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్(CM KCR). తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేత, తుంగతుర్తి నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
CM KCR Comments on Congress
తనతో పాటు ఉద్యమ సమయంలో వెన్నంటి ఉన్న వారిలో జగదీశ్ రెడ్డి ఒకడని గుర్తు చేశారు. ఆయన నిజాయితీ పరుడైన, నిఖార్సైన పోరాట యోధుడని కీర్తించారు. దశాబ్దాల పాటు తెలంగాణను కరువు కోరల్లో ముంచెత్తింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు కేసీఆర్.
ఇన్నేళ్లుగా తెలంగాణ సర్వ నాశనమైందని వాపోయారు. తాను ఒక్కడినే ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఉద్యమించానని, తన వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని అన్నారు.
ఇవాళ కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఎందరో బలిదానాలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ కాదా అని మండిపడ్డారు కేసీఆర్. ఇవాళ సూర్యాపేట నియోజకవర్గంలో 2 లక్షల 15 వేల ఎకరాలు సాగవుతున్నాయని ఈ క్రెడిట్ అంతా తన వల్లనే జరిగిందన్నారు సీఎం.
Also Read : Eatala Rajender : బండిపై ఫిర్యాదు చేయలేదు