RS Praveen Kumar : బర్రెలక్కపై దాడి దారుణం
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : హైదరాబాద్ – కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నిరుద్యోగ మహిళ బర్రెలక్క శిరీషతో పాటు సోదరుడు, ఇతర సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బుధవారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఉందా అని ప్రశ్నించారు.
RS Praveen Kumar reacted for attack on Barrelakka
ఈ దాడికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, బర్రెలక్కకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). రాజకీయాలు కేవలం ఆధిపత్య వర్గాలు మాత్రమే చేయాలా అని నిలదీశారు. గతంలో తాను చదువుకున్నా జాబ్స్ రాలేదని, అందుకే బర్రెలు కాస్తున్నానని తాను చేసిన రీల్ సెన్సేషన్ క్రియేట్ చేసిందన్నారు. దానిని తట్టుకోలేక , ఆమెకు రోజు రోజుకు వస్తున్న ప్రచారాన్ని, ఆదరణను చూసి తట్టుకోలేక పోతున్నారని అందుకే వ్యక్తిగతంగా ఎదుర్కోలేక భౌతికంగా దాడికి దిగారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. బర్రెలక్క మీద కేసు నమోదు చేస్తే బీఎస్పీ ఆమెకు మద్దతుగా నిలిచిందని ఈ విషయాన్ని మరిచి పోవద్దని స్పష్టం చేశారు. భౌతిక దాడులు పరిష్కారం కాదని తెలుసు కోవాలన్నారు.
Also Read : CM KCR : కాంగ్రెస్ మోసం తెలంగాణ నాశనం