National Herald Case : సోనియా..రాహుల్ కు బిగ్ షాక్
రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్
National Herald Case : న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ కేసు. ఈ కేసులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు మాజీ చీఫ్ సోనియా గాంధీ, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ లకు బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది.
National Herald Case on Rahul and Sonia Gandhi
ఇందులో భాగంగా సోనియా కుటుంబానికి చెందిన దేశంలోని ఢిల్లీ, ముంబై, లక్నోలలో ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఈడీ(ED) వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీకి ఎదురు గాలి వీస్తోందనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మొత్తం రూ. 752 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు స్పష్టం చేసింది ఈడీ. అయితే ఎన్నికల కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ కావాలని దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.
అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది బీజేపీ. కేంద్ర దర్యాప్తు సంస్థలు లేవదీసిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేదని పేర్కొంది. దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది కేంద్రం. ఇదిలా ఉండగా ఆస్తుల జప్తు అనేది తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మంచి ఆయుధం లభించినట్లయింది.
Also Read : Divya Vani Join : కాంగ్రెస్ లో చేరిన నటి దివ్యవాణి