Mayawati : సూర్యాపేట – బీఎస్పీ ద్వారానే ప్రజా పాలన సిద్దిస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కుమారి మాయావతి అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేటలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Mayawati Comment
ఐపీఎస్ పదవిని వదులుకుని కేవలం ప్రజల కోసం సేవ చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారని అన్నారు. ఆయనను సీఎం చేసేందుకు మీరంతా కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో దక్షిణాదిన బీఎస్పీని విస్తరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
బీఎస్పీ పోరాటం చేయడం వల్లనే మండల్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గతంలో పని చేసిన కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నం చేసిన పాపాన పోలేదన్నారు మాయావతి(Mayawati). ఇకనైనా ప్రజలు మేలుకోవాలని, ప్రతి ఒక్కరు ఆర్ఎస్పీకి సహకారం అందించాలని కోరారు.
అతడే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. కాన్షీరాం, బాబా అంబేద్కర్ కలలు సాకారం కావాలంటే బీఎస్పీని ఆశీర్వించాలని కోరారు మాయావతి.
Also Read : Priyanka Gandhi : మోదీ ప్రభుత్వం జనం పాలిట శాపం