Congress Slams : కారు పంక్చ‌ర్ ఖాయం – కాంగ్రెస్

సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Congress : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. 9న కొత్త స‌ర్కార్ కొలువు తీర‌నుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన స‌ర్వే సంస్థ‌ల‌లో అత్య‌ధిక స‌ర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి.

Congress Slams BRS

మ‌రో వైపు గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఉద్య‌మ నాయ‌కుడిగా , ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేసిన సీఎంగా పేరు పొందిన కేసీఆర్ నోటి వెంట ఓట‌మి మాట ప‌దే ప‌దే వినిపిస్తోంది. ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అచ్చంపేట‌లో జ‌రిగిన మీటింగ్ లో ఓడిస్తే త‌న‌కు ఏం ఫ‌ర‌ఖ్ ప‌డ‌ద‌ని కానీ మీకే న‌ష్ట‌మ‌ని, తాను ఎంచ‌క్కా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాన‌ని అన్నారు.

విచిత్రం ఏమిటంటే బ‌రిలో బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ పార్టీలు ఎన్నిక‌ల క‌ద‌న రంగంలో పోటీ ప‌డుతున్నా కేవ‌లం కేసీఆర్ కాంగ్రెస్(Congress) పార్టీని టార్గెట్ చేస్తుండ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. మ‌రో వైపు బీఆర్ఎస్ కు, కేసీఆర్ , గులాబీ శ్రేణుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఆ పార్టీ అన్ని పార్టీల కంటే ముందంజ‌లో ఉంద‌నేది వాస్త‌వం. ప్ర‌త్యేకించి బీఆర్ఎస్ , బీజేపీ ఒక్క‌టేన‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు పోవ‌డంలో విజ‌యం సాధించింది.

తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ కారు వాహ‌నం పంక్చ‌ర్ ను ఫోటో షేర్ చేసింది. ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : G Kishan Reddy : రాహుల్ ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రా

Leave A Reply

Your Email Id will not be published!