PM Modi : క‌లుస్తాన‌న్న కేసీఆర్ ను వ‌ద్ద‌న్నా

సీఎంపై పీఎం మోదీ కామెంట్స్

PM Modi : మ‌హ‌బూబాబాద్ – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బీజేపీతో క‌లిసి ప‌ని చేసేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని చెప్పారు. కానీ నేను వ‌ద్ద‌న్నాన‌ని తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం మ‌హ‌బూబాబాద్ నియోకజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన విజ‌య్ సంక‌ల్ప్ యాత్ర స‌భ‌లో ప్ర‌సంగించారు.

PM Modi KCR Issue

తెలంగాణ ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు తాను కేసీఆర్ ఆఫ‌ర్ ను వ‌ద్ద‌న్నాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో త‌న‌పై క‌క్ష క‌ట్టాడ‌ని , ప్ర‌తి చిన్న అంశాన్ని వాడుకుని త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని ఆరోపించారు. సీఎం మూఢ న‌మ్మ‌కాల‌ను పెంచేలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు న‌రేంద్ర మోదీ.

ఫామ్ హౌస్ సీఎం మ‌న‌కు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు పీఎం(PM Modi). సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్య‌మ‌న్నారు. తెలంగాణ స‌ర్కార్ వ్యాట్ త‌గ్గించ లేద‌న్నారు. కేంద్ర స‌ర్కార్ త‌గ్గించినా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించ లేద‌న్నారు. ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గాలా వ‌ద్దా లేదా అని ప్ర‌జ‌ల‌ను కోరారు.

తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రానుంద‌న్నారు. బీఆర్ఎస్ ను సాగ‌నంపాల‌ని ప్ర‌జ‌లు నిర్ణ‌యం తీసుకున్నార‌ని పేర్కొన్నారు. తెలంగాణ కొత్త చ‌రిత్ర లిఖించ బోతోంద‌న్నారు. బీజేపీకి ఆద‌ర‌ణ పెరుగుతుంద‌న్నారు మోదీ.

Also Read : Gujarat Titans Skipper : గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!