PM Modi : క‌మ‌లం విజ‌యం త‌థ్యం – మోదీ

హైద‌రాబాద్ రోడ్ షోలో ప్ర‌ధాన‌మంత్రి

PM Modi : రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీజేపీ ఆధ్వ‌ర్యంలో రోడ్ షో చేప‌ట్టారు. భారీ ఎత్తున జ‌నం పోగ‌య్యారు. వారి నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను చూసి ప్ర‌ధాన‌మంత్రి ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. తాను హైద‌రాబాద్ ను , ఇక్క‌డ భాగ్య‌న‌గ‌ర వాసుల‌ను మ‌రిచి పోలేన‌ని అన్నారు.

PM Modi Comment

ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ రైల్వే స్టేష‌న్ దాకా రోడ్ షో కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు మోదీకి. తాను మాట ఇవ్వ‌న‌ని ఇస్తే త‌ప్ప‌న‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi). కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు ఒక్క‌టేన‌ని అన్నారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలంటూ ఎద్దేవా చేశారు . మొద‌టిసారి బీజేపీ అధికారంలోకి రాబోతోంద‌ని జోష్యం చెప్పారు.

ఈ ప‌దేళ్ల కాలంలో దొర పాల‌న సాగుతోంద‌న్నారు. కేసీఆర్ కుటుంబం అంతులేని అవినీతికి పాల్ప‌డింద‌ని, తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే విచార‌ణ చేప‌డ‌తామ‌ని, జైలుకు పంపించ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇన్నేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కేవ‌లం దోచుకోవ‌డం, దాచు కోవ‌డానికే ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో 60కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు మోదీ.

Also Read : Rahul Gandhi : కొలువుల భ‌ర్తీకి క‌ట్టుబ‌డి ఉన్నాం

Leave A Reply

Your Email Id will not be published!