Barrelakka : కొల్లాపూర్ – రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. గురువారం పోలింగ్ సందర్భంగా బర్రెలక్క స్వయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అతిరథ మహారథులు పోటీలో ఉన్నా వారి గురించి ఎవరూ పట్టించు కోవడం లేదు. కానీ కేవలం బర్రెలక్కపై ఫోకస్ పెట్టారు.
Barrelakka Vote Completed
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీలో ఉన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ లో బరిలో నిలిచారు. ఇక రేవంత్ రెడ్డి కోడంగల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాలలో ఫైట్ ఇస్తున్నారు. బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ సైతం తన లక్ ను పరీక్షించు కోనున్నారు.
విచిత్రం ఏమిటంటే కొల్లాపూర్(Kollapur) లో హోరా హోరీ పోరు కొనసాగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , బీఆర్ఎస్ పార్టీ తరపున బీరం హర్షవర్దన్ రెడ్డి , బీజేపీ నుంచి సుధాకర్ రావు పోటీలో ఉన్నా ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క బిగ్ ఫైట్ ఇస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆమె దెబ్బకు బెంబేలెత్తి పోతున్నారు.
Also Read : Akunuri Murali : ఓటేయండి డెమోక్రసీని కాపాడండి