Daggubati Purandeswari : సాగర్ ఘర్షణ వెనుక రాజకీయం
నిప్పులు చెరిగిన పురంధేశ్వరి
Daggubati Purandeswari : అమరావతి – ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న అర్ధరాత్రి నాగార్జునా సాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య రాద్దాంతం చోటుhttps://twitter.com/PurandeswariBJP?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor చేసుకుంది. దీనిపై తీవ్రంగా స్పందించారు పురంధేశ్వరి. సాగర్ నీటి జలాల విడుదల అంశం గత కొన్ని రోజుల నుంచి జరుగుతోందని కానీ ఎన్నికలప్పుడే ఇది గుర్తుకు రావడం శోచనీయమని పేర్కొన్నారు. ఇది పక్కా వ్యూహాత్మకంగా రాజకీయం చేయడం తప్ప మరోటి కాదని మండిపడ్డారు.
Daggubati Purandeswari Shocking Comments
ఓ వైపు ఎన్నికలు జరుగుతుంటే స్వేచ్ఛగా ఓటు వేయాల్సిన పరిస్థితులను కల్పించకుండా ఇలాంటి ఘర్షణకు ఎలా దిగుతారంటూ నిలదీశారు. సాగర్ వద్ద జరుగుతన్న ఘర్షణ అత్యంత బాధాకరమని పేర్కొన్నారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari). విభజన సమయంలో కూడా ఏపీ, తెలంగాణ సెంట్రల్ ఫోర్సులతో సహా ఘర్షణకు దిగారని ఇవాళ ఇది తిరిగి పునరావృతం కావడం పై ఆవేదన చెందారు.
ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలా జరుగుతోందంటూ ధ్వజమెత్తారు. ఇకనైనా రెండు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలని, సామరస్య పూర్వకమైన ధోరణితో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని దగ్గుబాటి సూచించారు.
Also Read : Chiranjeevi Vote : ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి