Congress CM : తెలంగాణ సీఎం ఎంపికపై సస్పెన్స్
ప్రకటించనున్న ఏఐసీసీ హైకమాండ్
Congress CM : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. తుది ఫలితాలు వచ్చాయి. ప్రజా తీర్పు దెబ్బకు దొర కేసీఆర్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. గంప గుత్తగా కాంగ్రెస్(Congress) పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు. మొత్తం 119 శాసన సభ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రాగా ప్రతిపక్షంగా ఉండ బోతున్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. ఇక భారతీయ జనతా పార్టీ 8 సీట్లు పొందగా ఎంఐఎం 7 సీట్లను తిరిగి కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్న సీపీఐ ఒక సీటులో పోటీ చేసి గెలుపొందింది.
Congress CM Confirmation Updates
ఇక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అయితే పాలనాధిపతిగా ఎవరు ఉండాలనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంద. సీఎల్పీ సమావేశం హైదరాబాద్ లోని హోటల్ లో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఏకవాక్య తీర్మానం చేశారు. ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలనే దానిపై తుది నిర్ణయం ఏఐసీసీ హై కమాండ్ కు వదిలి వేశారు.
ఈ విషయాన్ని పార్టీ పరిశీలకుడిగా ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్ రావు ఠాక్రే హుటా హుటిన ఢిల్లీకి బయలు దేరారు. ఇవాళో లేదా రేపో సీఎం అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఇక సీఎం రేసులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
Also Read : Heavy Rain AP : భారీ వర్షం అతలాకుతలం