Tirumala Rush : శ్రీవారి ఆదాయం రూ. 3.42 కోట్లు
దర్శించుకున్న భక్తులు 55,909
Tirumala Rush : తిరుమల – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అయినా లెక్క చేయకుండా భక్తులు తరలి వస్తున్నారు. మరో వైపు తిరుమల ఘాట్ రోడ్డులో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనదారులను అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి. ఈ మేరకు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, తమ సూచనలు పాటించాలని, టీటీడీతో సహకరించాలని కోరారు.
Tirumala Rush with Devotees
ఇదిలా ఉండగా తిరుమల పుణ్య క్షేత్రానికి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది టీటీడీ(TTD). కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 55 వేల 909 మంది భక్తులు దర్శించుకున్నారు.
స్వామి , అమ్మ వార్లకు 17 వేల 209 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం భక్తులు క్యూ లైన్ కొనసాగుతోంది. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా పడుతుందని తెలిపారు.
Also Read : Heavy Rain : చెన్న పట్టణం అస్తవ్యస్తం