MK Stalin : త‌మిళ‌నాడులో రెడ్ అల‌ర్ట్ – సీఎం

ప‌ర్య‌వేక్షిస్తున్న ఎంకే స్టాలిన్

MK Stalin : త‌మిళ‌నాడు – బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. అది భారీ తుపానుగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కుండ పోత‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎక్క‌డ చూసినా వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. జాతీయ ర‌హ‌దారుల‌తో పాటు ప‌లు చోట్ల నీళ్ల‌తో నిండి పోయాయి. భారీగా ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది. చాలా చోట్ల వాహ‌నాలు నిలిచి పోయాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్ర‌యాణీకులు, వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

MK Stalin Declared

మ‌రో వైపు త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్న ప‌ట్ట‌ణం (చెన్నై) పూర్తిగా నీళ్ల‌తో నిండి పోయింది. ఎక్క‌డిక‌క్క‌డ స‌హాయ‌క ఏర్పాట్ల‌లో మునిగి పోయారు. ప్ర‌ధానంగా న‌గ‌రం జ‌ల దిగ్భంధంలో చిక్కుకుంది. వేలాది మంది నిరాశ్ర‌యులుగా మారారు. బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది.

పూర్తిగా జ‌ల‌మ‌యం కావ‌డంతో కార్లు కొట్టుకు పోయాయి వ‌ర‌ద ఉధృతికి. దీంతో ఎన్ఆర్డీఎఫ్ ద‌ళాలు రంగంలోకి దిగాయి. తుపాను దెబ్బ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 8 మంది చ‌ని పోయిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టాల‌ని ఆదేశించారు.

ఆయ‌నే స్వ‌యంగా వాతావ‌ర‌ణ శాఖ కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లారు. ప్ర‌స్తుతం వ‌ర‌ద ఉధృతి త‌గ్గ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మ‌రో వైపు ఎలాంటి సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఆయ‌న సీఎంకు ఫోన్ చేశారు.

Also Read : Vijaya Shanti : కేసీఆర్ మారాలి అహంకారం వీడాలి

Leave A Reply

Your Email Id will not be published!