Heavy Rains : కుండపోత వర్షం గుండె కోత
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Heavy Rains : అమరావతి – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. ఓ వైపు తమిళనాడు అంతటా వర్షం ముంచెత్తితే , ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో చాలా చోట్ల వర్షం తాకిడి కొనసాగుతూనే ఉంది. మిచౌంగ్ తుపాను దెబ్బకు జనం అల్లాడుతున్నారు.
Heavy Rains in AP
ఈ సందర్బంగా రాష్ట్ర వాతావరణ శాఖ కేంద్రం డైరెక్టర్ అంబేద్కర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉందని, బాపట్లకు 110 కి.మీ. మచిలీ పట్నానికి 170 కి.మీ. దూరంలో తుపాన్ నిలిచి ఉందని తెలిపారు
మధ్యాహ్నం లోపు నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్ర తుఫానుగా తీరం దాటనుందని స్పష్టం చేశారు. తీరం వెంట గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Also Read : Chandra Babu Naidu : సహాయక చర్యల్లో జగన్ విఫలం