Congress Cabinet : హ‌స్తిన‌లో మ‌కాం కేబినెట్ కు శ్రీ‌కారం

సీఎం రేవంత్ రెడ్డి హ‌స్తిన‌లో హ‌ల్ చ‌ల్

Congress Cabinet : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. సీఎల్పీ నేత‌గా ఏఐసీసీ హైక‌మాండ్ రేవంత్ రెడ్డిని ఖ‌రారు చేసింది. ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇక మిగిలింది మంత్రివ‌ర్గం కూర్పు. ఇప్ప‌టికే మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్కకు డిప్యూటీ సీఎం ద‌క్క‌నుంది. మిగ‌తా మంత్రులుగా ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. వెంట‌నే ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం ఆదేశించ‌డంతో రేవంత్ రెడ్డి హిస్త‌న‌లో మ‌కాం వేశారు.

Congress Cabinet Updates

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పెద్ద‌ల‌తో క‌స‌రత్తు ప్రారంభించింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ప‌లువురి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకు రావ‌డంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు రేవంత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కంటూ ఓ లిస్టును త‌యారు చేసుకుని హైక‌మాండ్ కు అంద‌జేసిన‌ట్లు తెలిసింది.

కీల‌క శాఖ‌లు ఇవ్వ‌నున్న‌ట్లు టాక్. భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ధ‌న‌స‌రి అన‌సూయ అలియాస్ సీత‌క్క‌, కొండా సురేఖ‌, వివేక్ వెంక‌ట స్వామి, సుద‌ర్శ‌న్ రెడ్డి, ష‌బ్బీర్ అలీ, దామోద‌ర రాజ న‌ర‌సింహ‌, జూప‌ల్లి కృష్ణారావు, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు , చిన్నా రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ , మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ , విజ‌య శాంతిపేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read : Revanth Reddy CM : సామాన్యుడి నుంచి సీఎం దాకా

Leave A Reply

Your Email Id will not be published!