Amaravathi Sabha : 17న అమరావతి సభ
అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు
Amaravathi Sabha : అమరావతి – ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి లోనే కొనసాగించాలని కోరుతూ గత నాలుగు సంవత్సరాలుగా పోరటం చేస్తూ వస్తున్నారు. దీంతో ఈనెల 17న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గతంలో టీడీపీ హయాంలో కొలువు తీరిన ప్రభుత్వం అమరావతిని రాజధాని చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంచలన ప్రకటన కూడా చేశారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
Amaravathi Sabha on 17th December
మారిన రాజకీయ పరిస్థితులతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా కొలువు తీరారు. దీంతో సీన్ మారింది. ఆయన వచ్చాక అమరావతిని(Amaravathi) రాజధాని చేసే ప్రసక్తి లేదని ప్రకటించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రాజధానిగా ఉండాల్సిందేనంటూ పేర్కొంది.
చట్ట సభలో మూడు రాజధానులు చేస్తామని ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి. ఏపీకి సంబంధించి విశాఖ పట్టణంను రాజధానిగా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేపిటల్ సిటీ వివాదం నడుస్తోంది.
ఇదిలా ఉండగా అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడాన్ని తప్పు పట్టారు జనం.
Also Read : TTD Utsavalu : 12 నుంచి శ్రీవారి అధ్యయనోత్సవాలు