CM Revanth Reddy : సీఎంను కలవని ఐఏఎస్ లు
కేసీఆర్..కేటీఆర్ కు సన్నిహితులు
CM Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలి పోయింది. రాక్షస పాలన అంతమైంది. ప్రజా పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొలువు తీరారు. ఆ వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించారు.
CM Revanth Reddy Viral
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారులు. అయితే రేవంత్ వచ్చాక సదరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కలవక పోవడం విస్తు పోయేలా చేసింది. మర్యాద పూర్వకంగానైనా కలవాల్సిన అవసరం ఉంది.
సదరు ఆఫీసర్లపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ఇలాఖాలో సీనియర్ ఐఏఎస్ గా ఉన్న జయేశ్ రంజన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. నీటి పారుదల శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఇటీవలే నియమితులయ్యారు స్మితా సభర్వాల్ , ప్రియాంక వర్గీస్ , అరవింద్ కుమార్ అన్నీ తామై వ్యవహరించారు. వారే తాము సర్కార్ అన్నట్టుగా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు.
ప్రస్తుతం సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు శేషాద్రి. ఆయన బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ రెడ్డి వచ్చాక పెను మార్పులు తీసుకుంటున్నారు. ఈ నలుగురు అధికారులపై వేటు వేసే అవకాశం ఉంది.
Also Read : Gudivada Amarnath : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి