Mayawati Declare : నా వారసుడు ఆకాష్ ఆనంద్
సంచలన ప్రకటన చేసిన మాయావతి
Mayawati : ఉత్తర ప్రదేశ్ – బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు , మాజీ సీఎం కుమారి మాయవతి సంచలన ప్రకటన చేశారు. ఆదివారం పార్టీ పరంగా కీలక సమావేశం జరిగింది. ఈ మేరకు తన వారసుడు ఎవరో అనే ఉత్కంఠకు తెర దించారు మాజీ సీఎం. ఈ మేరకు తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తన తదుపరి పార్టీని లీడ్ చేస్తారంటూ వెల్లడించారు.
Mayawati Declared new Person
రాబోయే 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ సమావేశంలో ఈ కీలక అంశం వెల్లడించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం మూడో కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీజేపీ కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చింది.
తాను కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్నానని, రాబోయే కాలంలో తామే అసలైన ప్రత్యామ్నాయంగా మారబోతున్నామని ప్రకటించారు కుమారి మాయావతి(Mayawati). ప్రస్తుతం ఎవరీ ఆకాశ్ ఆనంద్ అనే దానిపై అంతా వెతుకుతున్నారు.
బీఎస్పీని ఏర్పాటు చేసింది దివంగత కాన్షీరాం. ఆయన కుమారి మాయావతిని నాయకురాలిగా మార్చారు. తనను సీఎంగా చేస్తానని ప్రకటించారు. తాను చెప్పినట్టుగానే చేసి చూపించారు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ తదుపరి పార్టీ పగ్గాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం.
Also Read : Vishnu Deo Sai : చత్తీస్‌గఢ్ సీఎంగా విష్షు దేవ్ సాయ్