Ashwathama Reddy : ఆర్టీసీ యూనియన్లకు గ్రీన్ సిగ్నల్
సానుకూలంగా మంత్రి స్పందన
Ashwathama Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బందికి ఖుష్ కబర్ చెప్పారు తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు అశ్వథ్థామ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ను కలిశారు. ఈ సందర్బంగా గత ప్రభుత్వం అనుసరించిన తీరును , తీసుకున్న నిర్ణయాల గురించి ఏకరువు పెట్టారు.
Ashwathama Reddy Viral
ఈ సందర్బంగా ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేశారు మాజీ సీఎం కేసీఆర్. అంతే కాకుండా ఓ వైపు నష్టాల్లో సంస్థ ఉందని చెబుతూనే ఇంకో వైపు ఆర్టీసీ సంస్థ చైర్మన్ ను నియమించారు. ఆయనకు ప్రత్యేకంగా ఖర్చులతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రికి ఏకరువు పెట్టారు.
యూనియన్లు లేకుండా రద్దు చేశారు. పూర్తిగా మేనేజింగ్ డైరెక్టర్ కు సర్వాధికారాలు కట్టబెట్టారు. తీవ్రమైన ఒత్తిళ్లు, టార్గెట్ లు ఇస్తూ నానా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఓ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది ఇంటి బాట పట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు అనువుగా ఉండేలా ఆర్టీసీ సంస్థలను గంపగుత్తగా లీజుకు ఇచ్చుకుంటూ పోయారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మాల్ నిర్మించుకునేలా చేసిందని, ఏడున్నర కోట్ల బకాయిలు కట్ట లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు.
Also Read : Jeevan Reddy MLC : ఉచిత ప్రయాణం మహిళలకు వరం