RS Praveen Kumar : ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్లకు శాపం
బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : హైదరాబాద్ – మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచితంగా ప్రయాణ పథకం వల్ల ఇప్పుడిప్పుడే గాడిలో పడిన ఆర్టీసీ సంస్థపై అదనపు భారం పడుతుందన్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు గండి పడే ఛాన్స్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
RS Praveen Kumar Comment
అంతే కాకుండా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్న 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులను తెలంగాణ వచ్చాక రకరకాల కారణాలు చూపి బంద్ చేశారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తిరిగి మళ్లీ ఆ సర్వీసులను పునరుద్దరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఒక పథకాన్ని అమలు చేసే ముందు నష్ట పోతున్న వారి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Also Read : Ashwathama Reddy : ఆర్టీసీ యూనియన్లకు గ్రీన్ సిగ్నల్