Telangana Ministers : మంత్రులకు ఛాంబర్స్ కేటాయింపు
ప్రజా దర్బార్ కు పోటెత్తిన జనం
Telangana Ministers : హైదరాబాద్ – తెలంగాణలో కొత్త సర్కార్ కొలువు తీరింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తనదైన శైలిలో ఆయన పాలన సాగిస్తున్నారు. వచ్చీ రావడంతోనే ప్రధాన శాఖలపై దృష్టి సారించారు. ప్రధానంగా విద్యుత్ సంస్థతో పాటు నీటి పారుదల శాఖపై సమీక్షించారు.
Telangana Ministers Chambers
ఈ సందర్బంగా సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). వెంటనే తన ముందుకు రావాల్సిందిగా ట్రాన్స్ కో , జెన్ కో సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం మారిన వెంటనే తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు రాష్ట్రంలో అక్రమంగా కొలువు తీరిన 54 కార్పొరేషన్లు, ఓఎస్డీలు, వ్యక్తిగత కార్యదర్శులను తీసి వేశారు. మరో వైపు మంత్రులకు ఛాంబర్స్ కేటాయించాలని ఆదేశించారు. ఈమేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
6వ అంతస్తులో సీఎం రేవంత్ రెడ్డికి ఛాంబర్ ను కేటాయించారు. 2వ ఫ్లోర్ లో ఫైనాన్స్ , ప్లానింగ్ , ఎనర్జీ శాఖలకు కేటాయించారు. నీటి పారుదల, క్యాడడ్, పౌర సరఫరాల శాఖలను 4వ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ , సైన్స్ అండ్ టెక్నాలజీ , ఆర్ అండ్ బి సినిమాటోగ్రఫీ శాఖలను 5వ అంతస్తులో కేటాయించారు.
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు 3వ అంతస్తు కేటాయించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గ్రౌండ్ ఫ్లోర్ , పొన్నం ప్రభాకర్ కు 5వ అంతస్తు, కొండా సురేఖకు 4వ అంతస్తు, సీతక్కకు ఫస్ట్ ఫ్లోర్ , తుమ్మల నాగేశ్వర్ రావుకు 3వ ఫ్లోర్ , జూపల్లి కృష్ణారావుకు 4వ అంతస్తు కేటాయించారు.
Also Read : Priyanka Gandhi : అమరావతి సభకు ప్రియాంక