Nara Lokesh : లోకేష్ 3,000 కిలోమీటర్లు పూర్తి
యువ గళం పాదయాత్రలో కీలకం
Nara Lokesh : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువ గళం పాదయాత్ర సోమవారం నాటికి 3,000 కిలోమీటర్లు పూర్తయ్యాయి. మెరుగైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తాను ఈ యాత్ర చేపట్టినట్లు ఇప్పటికే ప్రకటించారు నారా లోకేష్.
Nara Lokesh Yuva Galam 3000km’s Completed
ప్రస్తుతం తుని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అన్ని వర్గాల నుంచి ప్రజల ఆదరణ లభిస్తోంది. ఇటీవల తుఫాను దెబ్బకు ఏపీ అల్లాడింది. పెద్ద ఎత్తున చేతికి వచ్చిన పంట పొలాలు నేలపాలయ్యాయి. దీంతో వందలాది మంది రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఓ వైపు తన తండ్రి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కూడా పర్యటిస్తున్నారు. తుఫాను తీవ్ర ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
మరో వైపు నారా లోకేష్ సైతం యువ గళంతో ముందుకు వెళ్లారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ఏపీ సీఎం జగన్ రెడ్డి నాశనం చేశాడని ఈ సందర్భంగా ఆరోపించారు. తాము వచ్చాక ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు . తుని నియోజకవర్గంలో పంటలు కోల్పోయిన రైతులతో ముచ్చటించారు.
వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు నారా లోకేష్. తన పాదయాత్ర నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. జగన్ రెడ్డిపై యుద్దం ఆగదన్నారు టీడీపీ చీఫ్.
Also Read : AP CM YS Jagan : యువ న్యాయవాదులకు జగన్ ఆసరా