AP CM YS Jagan : జగన్ సంచలన నిర్ణయం
పలు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు
AP CM YS Jagan : తాడేపల్లి గూడెం – ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రానున్నాయి. దీంతో మరోసారి పవర్ లోకి రావాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ముందే గ్రహించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటి నుంచే కీలక చర్యలకు దిగారు. ఏపీలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొత్తగా కోఆర్డినేటర్లను నియమించారు. ఒక రకంగా ఇది బిగ్ షాక్ అని చెప్పక తప్పదు పార్టీ పరంగా.
AP CM YS Jagan Shocking Decision
ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఏ ఒక్కరినీ పార్టీ వదులు కోదని స్పష్టం చేశారు. ఇక నుంచి పార్టీ కార్యక్రమాలను సమన్వయకర్తలు పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.
మెరుగైన ఫలితాల కోసమే ఈ మార్పులు చేయడం జరిగిందన్నారు. వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు బొత్స. అందరికీ సముచిత స్థానం ఇచ్చేందుకు జగన్ రెడ్డి(AP CM YS Jagan) కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ ఈసారి భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్నారని మొత్తం సీట్లను క్లీన్ స్వీప్ చేయాలని , ఆ దిశగా ప్రయత్నం జరుగుతోందన్నారు బొత్స సత్యనారాయణ.
ఇక నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే పత్తిపాడు నియోజకవర్గానికి బాల సాని కిరణ్ కుమార్ ను కో ఆర్డినేటర్ గా నియమించింది. కొండెపికి ఆది మూలపు సురేష్ , వేమూరుకు వరికూటి అశోక్ బాబు, తాడికొండకు మేకతోటి సుచరిత, సంతనూతలపాడుకు మేరుగు నాగార్జున, చిలకలూరిపేటకు రాజేశ్ నాయుడును నియమించారు జగన్ రెడ్డి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి విడదల రజని, అద్దంకికి పాణెం హనిమి రెడ్డి, మంగళగిరికి గంజి చిరంజీవి, రేపల్లెకు ఈపురు గణేష్ , గాజువాకకు వరికూటి రామచంద్రరావు ను నియమించారని బోత్స, సజ్జల వెల్లడించారు.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.28 కోట్లు