Anjani Kumar DGP : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్. ఆయనతో మరికొందరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు క్యూ కట్టారు. రేవంత్ కు బొకేలు ఇచ్చి తమను గుర్తుంచు కోవాల్సిందిగా కోరడం కలకలం రేపింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Anjani Kumar DGP Suspencion Cleared
ఏ హోదాతో డీజీపీ కలిశారో చెప్పాలని ఈసీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు డీజీపీగా ఉన్న అంజనీ కుమార్(Anjani Kumar DGP) పై వేటు వేసింది. తమకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. అంజనీ కుమార్ స్థానంలో సీనియర్ ఆఫీసర్ గా ఉన్న రవి గుప్తాను నియమించింది ఈసీ.
దీంతో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం తర్వాత ఈ మేరకు తమపై వేటు వేయడానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వివరణపై సంతృప్తి చెందిన ఈసీ డీజీపీ అంజనీ కుమార్ పై వేటు వేయడాన్ని తొలగించింది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంజనీ కుమార్ పై వేటు తొలగించడంతో ఆనందం వ్యక్తం చేశారు .
Also Read : Janardhan Reddy