Governer Slams : గవర్నర్ షాకింగ్ కామెంట్స్
కేసీఆర్ సర్కార్ పై వ్యాఖ్యలు
Governer Slams : హైదరాబాద్ – గతంలో కేసీఆర్ తో ఉప్పు నిప్పు లాగా ఉన్న గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్(Tamilisai Soundararajan) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇవాళ అసెంబ్లీ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు. బాధ్యతతో ఉండాల్సిన సీఎం, మంత్రివర్గం పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించారని ఆవేదన చెందారు.
Governer Slams KCR
ఇక ప్రస్తుతం సర్కార్ చేపట్టబోయే కార్యక్రమాలు, అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ఏకరవు పెట్టారు గవర్నర్. ప్రజా వాణి కింద వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూమికి సంబంధించినవే అయి ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ప్రతి శాఖకు సంబంధించి ఆర్థిక స్థితిగతులకు సంబంధించి శ్వేత పత్రాలను విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు గవర్నర్. 2013లో అప్పటి యూపీఏ సర్కార్ ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు గనుక వచ్చి ఉంటే హైదరాబాద్ మరింత అభివృద్ది చెంది ఉండేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల అణచివేత నుంచి విముక్తి పొందేందుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఇప్పుడు స్వేచ్ఛ, గాలిని పీల్చుతోందన్నారు. నిరంకుశ పాలన, నియంతృత్వ పోకడల నుంచి విముక్తి పొందిందన్నారు. ఎలాంటి అణచి వేతను సహించేది లేదన్నారు.
Also Read : Rushikonda Works : రుషికొండ నిర్మాణాలపై తనిఖీలు