AP CM YS Jagan : ఎన్నికలకు సిద్దంగా ఉండాలి – జగన్
ముందస్తుగానే వచ్చే ఛాన్స్
AP CM YS Jagan : అమరావతి – వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలని స్పష్టం చేశారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా అది పార్టీకి, తనకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుందన్నారు జగన్ రెడ్డి.
AP CM YS Jagan Comments on Elections
మంత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మన ముందున్న లక్ష్యం ఏమిటో స్పష్టంగా ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ఎవరికి వారు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని , వై నాట్ 175 అన్న నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. కార్యరంగంలోకి దూకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
మరో వైపు గతంలో కంటే ఈసారి రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు 20 రోజుల కంటే ముందే వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). కొందరు చేస్తున్న ఆరోపణలను, విమర్శలను తిప్పి కొట్టాలని , అవసరమైతే ఆధారాలతో సహా నిరూపించాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు , అమలు తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు. ఇవే మనకు రక్షణగా ఉంటాయని పేర్కొన్నారు సీఎం జగన్ రెడ్డి.
Also Read : Governer Slams : గవర్నర్ షాకింగ్ కామెంట్స్