AP CM YS Jagan : అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ కింద గతంలో ఉన్న సాయం పరిమితిని మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు. నూతన ఫీచర్లతో ఈనెల 18న ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 19న క్షేత్ర స్థాయిలో ఇది పూర్తిగా అమలు అవుతుందన్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల్లో జరిగే కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు పాల్గొంటారని సీఎం స్పష్టం చేశారు.
AP CM YS Jagan Comments Viral
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. కేన్సర్ వంటి అనేక వ్యాధులను వైద్యం అందించేలా చేసేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు జగన్ మోహన్ రెడ్డి.
గత నాలుగు సంవత్సరాలలో రూ. 1897 కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. ఆరోగ్య శ్రీ పై ఈ ఏడాది రూ. 4,400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు సీఎం. గత ప్రభుత్వంలో దీనిపై ఏటా కేవలం రూ. 1,000 కోట్లు మాత్రమే కేటాయించిందని ఎద్దేవా చేశారు. ఆరోగ్య శ్రీ కార్డుతో ఆస్పత్రికి వెళితే చాలు రూ. 25 లక్షల వరకు వైద్యం ఉచితంగా పొందవచ్చని తెలిపారు.
Also Read : Akbaruddin Owaisi : వైఎస్సార్ వల్లనే కాంగ్రెస్ కు మద్దతు