Telangana HC : మసీదుల్లోకి మహిళలను అనుమతించాలి
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Telangana HC : హైదరాబాద్ – దేశంలోనే సంచలన తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దేవుడి ముందు మహిళలు సమానమేనని పేర్కొంది. ముస్లిం సమాజానికి హితవు పలికింది. మహిళలను మసీదుల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది కోర్టు.
Telangana HC Orders
దేవాలయాలు, ప్రార్థనాల స్థలాలలో ఎందుకు లింగ వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్త్రీ, పురుషులు ఒక్కటేనంటూ స్పష్టం చేసింది. హాజీ అలీ దర్గా, శబరి మల , శని సింగపూర్ ప్రార్థనా స్థలాల్లోకి మహిళలను అనుమతించాలని ఇప్పటికే సంచలన తీర్పు చెప్పింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు.
ఇదిలా ఉండగా తెలంగాణ హైకోర్టులో మహిళల ప్రవేశానికి సంబంధించి విచారణ కొనసాగింది. దీనిపై వాదోప వాదనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. తుది తీర్పు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలలోకి మహిళలను తప్పకుండా పర్మిషన్ ఇవ్వాల్సిందేనని వక్ఫ్ బోర్డును ఆదేశించింది తెలంగాణ కోర్టు. జస్టిస్ కీలక తీర్పు వెలువరించింది.
Also Read : CM Revanth Reddy : కేసీఆర్ పై భగ్గుమన్న రేవంత్ రెడ్డి