KTR Slams : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ క‌న్నెర్ర‌

ఆయ‌న సీఎంగా అన‌ర్హుడు

KTR Slams : హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . శ‌నివారం శాస‌న స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న సీఎం ఉన్న‌త ప‌ద‌విలో ఉంటూ పొలిటిక‌ల్ లీడ‌ర్ గా మాట్లీడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

KTR Slams Revanth Reddy

తాము చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. బాధ్య‌తా యుత‌మైన ప‌ద‌విలో ఉంటూ ప్ర‌తిప‌క్షాల‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు కేటీఆర్(KTR). ఢిల్లీ నుండో లేదా క‌ర్ఖాట‌క నుండో రిమోట్ కంట్రోల్ చేయాల‌ని అనుకుంటే చూస్తూ ఉండ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రాంతాం వాడు మోసం చేస్తే ప్రాంతం లోనే పాతి పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో అన్ని రంగాల‌లో అభివృద్ది సాధించ‌డం జ‌రిగింద‌న్నారు. రేవంత్ రెడ్డి త‌న మాట తీరు మార్చుకోవాల‌ని సూచించారు.

ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ ఉండాలే త‌ప్పా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌కు దిగితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని, లేక పోతే తాము ప్ర‌జ‌ల ప‌క్షం వ‌హిస్తూ వాచ్ డాగ్ లాగా ప‌ని చేస్తామ‌న్నారు కేటీఆర్.

అధికారం ఉంది క‌దా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు.

Also Read : Telangana HC : మ‌సీదుల్లోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించాలి

Leave A Reply

Your Email Id will not be published!