Vijay Sai Reddy : బాలినేనితో విజయ సాయి భేటీ
పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని ఆవేదన
Vijay Sai Reddy : అమరావతి – ఇటీవలే వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలనంగా మారారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రాజీనామా చేసినంత మాత్రాన ఆమోదించినట్టు కాదన్నారు.
Vijay Sai Reddy Met with Balineni
ఇదిలా ఉండగా త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
పలు జిల్లాలకు ఉన్న పార్టీ సమన్వయకర్తలను మార్చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). టీడీపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే బాలినేనిని గిద్దలూరుకు వెళ్లాలని వైసీపీ అధిష్టానం సూచించింది.
అయితే విజయ సాయి రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు బాలినేని. తాను ఒంగోలు నుంచి బయటకు వెళ్లే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. జిల్లాలో తనకు ప్రాధాన్యత తగ్గించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టాను సారంగా సీట్లు ఇస్తే గెలవడం కష్టమన్నారు.
Also Read : KTR Slams : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కన్నెర్ర