Srikanth Goud : శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు పరార్
గాలిస్తున్న పాలమూరు పోలీసులు
Srikanth Goud : మహబూబ్ నగర్ జిల్లా – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాదాగిరి చెలాయించిన ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పై పలు కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత, ఉద్యోగ సంఘం నాయకుడు రాజేందర్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అడ్డం వచ్చిన వారిని కొట్టారు. దాదాపు దాడి జరిగిన సమయంలో 30 మందికి పైగా ఉన్నారని బాధితుడు రాజేందర్ రెడ్డి వాపోయారు.
Srikanth Goud Brother Escaped
ఈనెల 2న రాజేందర్ ఇంట్లోకి చొరబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇదంతా శ్రీకాంత్ గౌడ్ సారథ్యంలోనే జరిగిందని సమాచారం. రాజేందర్ రెడ్డి దాడి జరిగిన సమయంలో లేక పోవడంతో బతికి బయట పడ్డారు. ఇదే సమయంలో మరో కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డి, వాచ్ మెన్ సచిన్ పై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీస్ స్టేషన్ లో రాజేందర్ రెడ్డి, ఆయన భార్య వనజ ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 448, 324, 427, 504, 506, 379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 15న 458, 354, 323 సెక్షన్ల కింద శ్రీకాంత్ గౌడ్‌పై అదనపు కేసులు కూడా నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా ఈ దాడి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహేష్ గౌడ్ , రమేశ్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నట్టు సమాచారం. పట్టుకునేందుకు గాలింపు చర్యలు తీసుకున్నారు.
Also Read : Chandra Babu Naidu : జనసేనానితో చంద్రబాబు భేటీ