Revanth Reddy : పారిశ్రామిక వాడల ఏర్పాటు చేయాలి
సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూకుడు పెంచారు. ఆయన వెంట వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం రేపుతున్నారు. ఇప్పటికే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజా వాణికి తెర తీశారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులతో కలిసి సమీక్షలు చేపట్టారు.
Revanth Reddy Orders
ఇందులో భాగంగా తాజాగా భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయాలని సంకల్పించారు. ఇప్పటికే బిశ్వాల్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 40 లక్షల మంది దాకా నిరుద్యోగులు ఉన్నారని వారందరికీ జాబ్స్ ఇవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని, అంతే కాదు కొత్తగా ఇండస్ట్రీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో నూతన పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పేందుకు ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల, రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో 500 నుంచి 1000 ఎకరాల భూమిని గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read : Nara Lokesh : ఏపీలో పడకేసిన పాలన