Uttam Kumar Reddy : కేసీఆర్ నిర్వాకం ఉత్తమ్ ఆగ్రహం
మేడిగడ్డ డిజైన్ చేసింది మేం కాదు
Uttam Kumar Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారు. తాను ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్స్ కుంగి పోవడంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. ఇటీవల బాత్రూంలో కింద పడి శస్త్ర చికిత్స అనంతరం నందిహిల్స్ లో సేద దీరుతున్నారు. మొత్తంగా రాష్ట్ర ఖజానాకు రూ. 5,00,000 కోట్లకు పైగా అప్పుల భారం మోపారు.
Uttam Kumar Reddy Serious Comments on KCR
ప్రాజెక్టుల పేరుతో, రీ డిజైన్ల పేరుతో అందినంత మేరకు దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టులలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి పిల్లర్స్ కూలి పోవడంపై సమీక్ష చేపట్టారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). ఈ సందర్భంగా ఎవరు డిజైన్ చేశారని అడిగిన ఆయనకు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది ఎల్ అండ్ టి యాజమాన్యం.
తాము డిజైన్ చేయలేదని, దానికి అనుమతి లేదని, మొత్తం వ్యవహారం అంతా మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నలలోనే జరిగిందంటూ బాంబు పేల్చింది. దీంతో వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఉత్తమ్ ఆదేశించారు. ఈ సందర్బంగా మాజీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : VC Sajjanar : కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ చేయూత