KTR Slams : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు . గ్యారెంటీలను గాలికి వదిలేసి శ్వేత పత్రాలతో గారడీ చేస్తామంటే ఒప్పుకోమని అన్నారు కేటీఆర్.
KTR Slams Congress
ఎన్నికల ప్రచారంలో హామీలను ఇచ్చారని , అధికారంలోకి రాగానే వాటిని మరిచి పోతే ఎలా అని మండిపడ్డారు. పథకాల అమలుకు కుంటి సాకులు చూపిస్తే ఎలా అన్నారు. గద్దెను ఎక్కిన తర్వాత వాగ్ధానాలను తుంగలో తొక్కేందుకు ప్రయత్నం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
పవర్ పాయింట్ షోలు దేని కోసమని నిలదీశారు కేటీఆర్(KTR). శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలు కాదా అని ఫైర్ అయ్యారు. దశాబ్ది ఉత్సవాల్లో తాము విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక… ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రంగా పేర్కొన్నారు.
మేం దాచింది ఏమీలేదని, మీరు శోధించి..సాధించేది ఏమీ వుండదని స్పష్టం చేశారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదన్నారు.
Also Read : Nitin Gadkari : డ్రైవర్ రహిత వాహనాలకు చోటు లేదు