TTD Chairman Bhumana : 23 నుంచి వైకుంఠ దర్శనం
భక్తులకు టీటీడీ సూచనలు
TTD Chairman Bhumana : తిరుమల – వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల పుణ్య క్షేత్రంలో ఈనెట 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు స్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తోంది టీటీడీ. ఈ రోజుల్లో దాదాపు 8 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy). సూచనలు పాటించి సౌకర్యవంతంగా ఉండేలా శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
TTD Chairman Bhumana Comment
సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఉచిత టైంస్లాట్ టోకెన్లు తీసుకోవడం ద్వారా తిరుమల క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండకుండా దర్శనం చేసుకోవచ్చని సూచించారు. కావున భక్తులు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న తర్వాత మాత్రమే సర్వదర్శనానికి రావాలని తెలిపారు.
తిరుపతిలోని తొమ్మిది ప్రదేశాలలో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లలో టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కౌంటర్లలో 22న తేది మధ్యాహ్నం 2 గంటల నుండి 4,23,500 టోకెన్ల కోటా పూర్తయ్యేంత వరకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్.
దర్శనం టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్ళవచ్చని కానీ వారికి దర్శన భాగ్యం కలగదన్నారు. తిరుమలలో వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తమ టోకెన్ పై సూచించిన తేదీ, సమయానికే రావాలని కోరారు.
సిఫారసు లేఖలు స్వీకరించ బోమంటూ స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ