RTC MD VC Sajjanar : దూరం వెళ్లే వారికి సహకరించండి
RTC MD VC Sajjanar : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ బస్సులలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
RTC MD VC Sajjanar Comment
ఇదే సమయంలో మరో కీలక సూచన చేశారు ఎండీ. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ప్రయాణీకులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మహాలక్ష్మి పథకం కింద అవకాశం కల్పిస్తోంది. అయితే మహిళలు పల్లె వెలుగు బస్సులను ఉపయోగించు కోవడం లేదని, అందరూ ఎక్స్ ప్రెస్ బస్సులను వాడుకుంటున్నారని తెలిపారు.
దీని వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వీసీ సజ్జనార్(VC Sajjanar). తక్కువ దూరం ప్రయాణం చేసే మహిళా ప్రయాణీకులు పల్లె వెలుగు బస్సులను మాత్రమే ఉపయోగించు కోవాలని, ఆర్టీసీ సిబ్బందితో సహకరించాలని కోరారు . ఇక నుంచి అనుమతించిన స్టేజీలలోనే బస్సులను ఆపడం జరుగుతుందని స్పష్టం చేశారు ఎండీ.
ఇదిలా ఉండగా నూతన సంవత్సరం కావడం, సంక్రాంతి పండుగ రావడంతో , ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయాణీకులు ఇతర ప్రాంతాలకు, ఆలయాల దర్శనాలకు బస్సులను ఆశ్రయిస్తున్నారు.
Also Read : Nara Lokesh Slams : ప్రచారం ఎక్కువ పని తక్కువ