Pawan Kalyan : అభ్య‌ర్థుల ఎంపికపై ప‌వ‌న్ ఫోక‌స్

కేంద్ర క‌మిటీ కార్యాల‌యంలో స‌మీక్ష

Pawan Kalyan : మంగ‌ళ‌గిరి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు చేప‌ట్టింది. రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నిక‌ల బృందం రాష్ట్రంలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు చేసింది. దీంతో నిర్దేశించిన స‌మ‌యం కంటే ముందే రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు రానున్నాయ‌ని ప్ర‌క‌టించారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

Pawan Kalyan Focus

రాష్ట్రంలో మొత్తం 175 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతోంది వైసీపీ స‌ర్కార్. ఆ పార్టీ చీఫ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మ‌రో వైపు ఈసారి ఎన్నిక‌ల్లో నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని తెలుగుదేశం పార్టీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీలు సంయుక్తంగా పోటీ చేయనున్నాయి. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంయుక్తంగా ప్ర‌క‌టించారు.

ఏకాద‌శి ప‌ర్వ‌దినం కావ‌డంతో శ‌నివారం గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క స‌మావేశం చేప‌ట్టారు. ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఇప్ప‌టికే 15 నుంచి 20 నియోజ‌క‌వ‌ర్గాల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఉమ్మ‌డి జిల్లాల ప్రాతిప‌దిక‌న స‌మీక్ష‌లు కొన‌సాగుతున్నాయి.

రాబోయే రోజుల్లో అధికారం త‌మ‌దేన‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Also Read : RTC MD VC Sajjanar : దూరం వెళ్లే వారికి స‌హ‌క‌రించండి

Leave A Reply

Your Email Id will not be published!