KTR Slams : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదివారం శ్వేత పత్రానికి వ్యతిరేకంగా స్వేద పత్రం విడుదల చేసింది. తమ హయాంలో కావాలని అప్పులు చేయలేదని స్పష్టం చేశారు. పేదరికం పెద్ద ఎత్తున తగ్గి పోయిందన్నారు.
KTR Slams Congress Govt
కొత్తగా ఏర్పడిన సమయంలో పేదరిక శాతం 21.92 శాతం ఉండగా తాము దిగి పోయే నాటికి దానిని తక్కువ స్థాయికి తీసుకు వచ్చామన్నారు కేటీఆర్(KTR). ఈ మేరకు ప్రగతి భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వేద పత్రంలో వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో పేదరికం స్థాయి 5.8 శాతానికి తగ్గిందని, ఇదంతా తమ వల్లనే జరిగిందని స్పష్టం చేశారు కేటీఆర్.
కాగా దేశంలో ఏ రాష్ట్రంలో పేదరికం తగ్గలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశానికే దిక్సూచిగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు కేటాయించాలని ఏకంగా నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని అన్నారు కేటీఆర్.
తెలంగాణ అప్పులు రూ. 3,89,673 కోట్లు అని పేర్కొన్నారు. పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయని , కాంగ్రెస్ సర్కార్ కేవలం తమను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : INDW vs AUSW 1st Test : భారత మహిళా జట్టు అదరహో