INDW vs AUSW 1st Test : భార‌త మ‌హిళా జ‌ట్టు అద‌ర‌హో

8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

INDW vs AUSW 1st Test : ముంబై – భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకైక టెస్టులో స‌త్తా చాటింది. గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేయ‌డంతో దేశ వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపుతో దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi), క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినంద‌న‌లు తెలిపారు. రాబోయే రోజుల్లోనే మ‌రిన్ని విజ‌యాల‌ను సాధించాల‌ని కోరారు.

INDW vs AUSW 1st Test Updates

ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టుతో ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో టెస్టు మ్యాచ్ జ‌రిగింది.
హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని టీమిండియా మ‌హిళా జ‌ట్టు నిర్దేశించిన ఆఖ‌రు ల‌క్ష్యం 75 ప‌రుగుల‌ను కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది.

దీంతో చారిత్రాత్మ‌క‌మైన విక్ట‌రీని సాధించింది. ఇదిలా ఉండ‌గా ఈ ఏకైక టెస్టు మ్యాచ్ లో అత్య‌ద్భుతంగా బౌలింగ్ చేసి కీల‌క‌మైన 7 వికెట్ల‌ను తీయ‌డ‌మే కాకుండా జ‌ట్టు విక్ట‌రీలో కీల‌క పాత్ర పోషించిన స్నేహ్ రాణా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది.

రెండో ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్లు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును 261 ప‌రుగుల‌కు క‌ట్ట‌డి చేసింది. దీంతో స్వ‌ల్ప టార్గెట్ ను ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన మ‌హిళా ఆట‌గాళ్లు స్మృతీ మంధాన 38 ర‌న్స్ చేయ‌గా జెమీమా 12 ప‌రుగుల‌తో చివ‌రి దాకా నిలిచారు.

Also Read : Kodali Nani : బాబు..పీకే భేటీపై నాని సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!