Virat kohli : విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్
2000 మార్క్ ఏడోసారి
Virat kohli : పరుగుల వీరుడిగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ తన కెరీర్ లో అరుదైన ఘనతను సాధించాడు. క్యాలెండర్ ఇయర్ లో 2000 రన్స్ మార్క్ ను ఏడోసారి అధిగమించాడు. ఇది 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదు. ఒక ఆటగాడు ఇలాంటి ఫీట్ సాధించడం .
Virat kohli Record Runs
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ 76 రన్స్ చేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి మూటగట్టుకుంది. 32 పరుగుల తేడాతో సఫారీ టీం గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. వరుసగా ఏడు వేర్వేరు క్యాలెండర్ సంవత్సరాలలో 2 వేల రన్స్ సాధించడం మామూలు విషయం కాదు.
ఇదిలా ఉండగా దక్షిణాఫికా పేసర్స్ దుమ్ము రేపారు. వారి దెబ్బకు భారత బ్యాటర్లు కుప్ప కూలారు. పెవిలియన్ దారి పట్టారు. రబడా, జాన్సెన్ , నాండ్రే పేస్ త్రయం రెచ్చి పోవడంతో పరుగులు చేయలేక చతికిల పడ్డారు.
ఓ వైపు సహచర ఆటగాళ్లు ఒక్కరొక్కరూ అవుట్ అవుతున్నా లెక్క చేయకుండా కోహ్లీ 82 బంతులు ఎదుర్కొని 76 రన్స్ చేశాడు. ఇక విరాట్(Virat kohli) సాధించిన 2 వేల పరుగులు ఇలా ఉన్నాయి. 2012లో 2,186 రన్స్ చేశాడు. 2014లో 2,286 పరుగులు , 2016లో 2,595 రన్స్ , 2017లో 2,818 పరుగులు, 2018లో 2,735 రన్స్ , 2019లో 2,455 పరుగులు చేశాడు. మరే ఈ ఇతర ఆటగాడు ఇలాంటి ఫీట్ సాధించ లేదు.
Also Read : Chandra Babu Meetings : జనవరి 5 నుంచి టీడీపీ సభలు